Job opportunities abroad under the auspices of APSSDC
చదువు అయిపోయిందా? విదేశాల్లో ఉద్యోగం చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ అవకాశం మీకోసమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC), ఓవర్సీస్ మాన్‌పవర్ కార్పొరేషన్ (OMCAP) సంయుక్తంగా రిక్రూట్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బల్గేరియా, అల్బేనియా లాంటి యూరప్ దేశాలలో ఉద్యోగాలను కల్పించనున్నారు. కాబట్టి నిరుద్యోగులకు, అందులోను విదేశాల్లో జజాబ్ చేయాలనుకునేవారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఉద్యోగ వివరాలు:
బల్గేరియాలో మెకానికల్ డిజైన్ ఇంజినీర్లకు అవకాశం ఉంది. అల్బేనియాలో ఫ్యాక్టరీ మెకానిక్స్, ఎలక్ట్రిషియన్లు జాబ్స్ ఉన్నాయి.
విద్యార్హతలు:
మెకానికల్ డిజైన్ ఇంజినీర్ పోస్టుల కోసం అభ్యర్థులు B.E / B.Tech (మెకానికల్) చదువు పూర్తి చేసి ఉండాలి. అలాగే సంబంధింత విభాగంలో 5 నుంచి 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
మెకానిక్, ఎలక్ట్రిషియన్ పోస్టుల కోసం అభ్యర్థులూల్ డిప్లొమా / ITI పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. తెలిపారు.
వయోపరిమితి:
ఈ పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు కావాలి. వారి వయస్సు కూడా 45 సంవత్సరాలు మించకూడదు
వేతన వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెల జీతం రూ.1.5 లక్షల జీతం ఉంటుంది. అలాగే ఉచిత నివాసం, భోజన భత్యం, రవాణా, ఆరోగ్య బీమా కూడా ఉంటుంది. అయితే కనీసం 2 సంవత్సరాల ఒప్పందం ముందస్తుగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రిక్రూట్‌మెంట్ ఫీజు రూ.2 లక్షలు వరుకు ఉంటుంది (వీసా & ప్రయాణ ఖర్చులు కలుపుకొని)
ఎంపిక విధానం:
టెక్నికల్ స్కిల్ అసెస్‌మెంట్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 23 జూలై 2025
అవసరమైన ధ్రువపత్రాలు:
విద్యా అర్హత సర్టిఫికెట్లు, అనుభవ ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్ తీసుకొని రావాల్సి ఉంటుంది.
దరఖాస్తు:
అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://naipunyam.ap.gov.in/user-registration?page=program-registration లింక్ ద్వారా అప్లై చేసుకోవాలి. అలాగే బయోడేటాను skillinternational@apssdc.in కు మెయిల్ చేయాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం లేదా సందేహాల కోసం 9988853335, 8790117279, 8790118349, 8712655686 సంప్రదించవచ్చు.