Job Recruitment: హైదరాబాద్ హాల్ సెకండరీ స్కూల్ లో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది మార్చి 22, 2022గా నిర్ణయించారు.

Jobs (1)

Job Recruitment: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని హాల్ సెకండరీ స్కూల్ లో టీచింగ్ , నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి పీఆర్టీ, టీజీటీ, డ్యాన్స్ టీచర్, మ్యూజిక్ టీచర్, నర్సరీ టీచర్ తదితర పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి వస్తే ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బీసీఏ, బీఈడీ, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సీటెట్, టెట్ ఉత్తీర్ణత , సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక విధానం ఉంటుంది.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది మార్చి 22, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://halsecondaryschoolhyderabad.in సంప్రదించగలరు.