Jobs : బెంగుళూరు ఐసీఎమ్ఆర్,ఎన్సీడిఐఆర్ లో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. రీసెంట్ పాస్ పోర్ట్ సైజు ఫోటోతో పాటు పూర్తిచేసిన దరఖాస్తు, ఇతర సర్టిఫికెట్ కాఫీలను మే 9, 2022 తేదిలోపు పంపాల్సి ఉంటుంది.

Icmr Ncdir

Jobs : ఐసీఎంఆర్ , ఎన్ సిడిఐఆర్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టుల ఖాళీల వివరాలకు సంబంధించి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 9 ఖాళీలు, ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్ 1 ఖాళీ, కంప్యూటర్ ప్రోగ్రామర్ 3ఖాళీలు, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ 1 ఖాళీ, ప్రాజెక్ట్ సెక్షన్ ఆఫీసర్ 1 ఖాళీ ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి ప్రాజెక్ట్ సైంటిస్ట్ (మెడికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి ఎంబీబీఎస్ పట్టా కలిగి ఉండాలి. దీంతో పాటు ఒక ఏడాది పరిశోధన, బోధన అనుభవం కలిగి ఉండాలి. లేదా కమ్యూనిటీ మెడిసిన్, మెడిసిన్, పీడియాట్రిక్స్, పాథాలజీ, ఓబీ జిన్ లో అనుభవం ఉన్నాసరిపోతుంది.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. రీసెంట్ పాస్ పోర్ట్ సైజు ఫోటోతో పాటు పూర్తిచేసిన దరఖాస్తు, ఇతర సర్టిఫికెట్ కాఫీలను మే 9, 2022 తేదిలోపు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన ఈ మెయిల్ adm.ncdir@gov.in