Canara Bank : కెనరా బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీ

ఈనోటిపికేషన్ ద్వారా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.

Canra Bank Jobs

Canara Bank : బ్యాంకింగ్ రంగంలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కెనరా బ్యాంక్ శుభవార్త అందించింది. కెనరా బ్యాంకు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. ఈనోటిపికేషన్ ద్వారా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాలను పరిశీలిస్తే డిప్యూటీ మేనేజర్ – 2 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్, ఐటీ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ 2 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ బ్యాక్ ఆఫీస్ 1 పోస్ట్, జూనియర్ ఆఫీసర్ 2 పోస్టులు,డిప్యూటీ మేనేజర్2 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ ఐటి నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ 1 పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి వస్తే డిప్యూటీ మేనేజర్ – కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఐటి నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుకు కనీసం 50% మార్కులతో కంప్యూటర్ సైన్స్‌లో BE, B.Tech ఉత్తీర్ణులై ఉండాలి. డిప్యూటీ మేనేజర్ బ్యాక్ ఆఫీస్ పోస్టుకు కనీసం 45% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉండాలి. జూనియర్ ఆఫీసర్ పోస్టుకు కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు విషయానికి సంబంధించి జూనియర్ ఆఫీసర్ పోస్టులకు వయస్సు 22 నుంచి 28 సంవత్సరాలు , ఇతర పోస్టులకు 22 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. మే 20 , 2022 వరకు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపవచ్చు. ఆఫ్ లైన్ దరకాస్తులను పంపేందుకు చిరునామా ; జనరల్ మేనేజర్, హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్, కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్, 7వ అంతస్తు, మేకర్ ఛాంబర్ III నారిమన్ పాయింట్, ముంబై- 400021. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.canarabank.com పరిశీలించగలరు.