Ecil
Ecil Jobs : హైద్రాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఈసీఐఎల్ యూనిట్లలో ఒప్పంద ప్రాతిపదికన సాంకేతిక నిపుణుల నియామకాలు చేపట్టనున్నారు. ఇంటర్యూ విధానంలో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.నియామకం చేపట్టనున్న ఉద్యోగ వివరాల విషయానికి వస్తే టెక్నికల్ ఆఫీసర్లు 6, సైంటిఫిక్ అసిస్టెంట్లు 8, జూనియర్ ఆర్టిజన్లు 7, మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్యార్హతల విషయానికి వస్తే టెక్నికల్ ఆపీసర్లుకు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ , సౌంటిఫిక్ అసిస్టెంట్లకు సంబంధిత విభాగంలో డిప్లోమా, జూనియర్ ఆర్టిజన్లకు ట్రేడ్ లో రెండేళ్ళ ఐటిఐ కోర్సులో ప్రధమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. పైన పేర్కొన్న అన్ని పోస్టులకు ఏడాది పని అనుభవం తప్పనిసరి.
అభ్యర్ధుల వయస్సు టెక్నికల్ ఆఫీసర్లకు 30ఏళ్ళు, మిగిలిన పోస్టులకు 25ఏళ్ళు మించరాదు. వేతనం టెక్నికల్ ఆఫీసర్లకు నెలకు 23,000, సైంటిఫిక్ అసిస్టెంట్లకు 20,384, జూనియర్ ఆర్టిజన్లకు 18,564 రూపాయలు చెల్లిస్తారు. ధరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఇంటర్య్వ్యూలను ఆగస్టు 28,31, సెప్టెంబర్ 3,4,6 తేదీలలో నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్ధులు బెంగుళూరు, ముంబాయి, చెన్నై, న్యూఢిల్లీ ఈసీఐఎల్ జోనల్ కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకోసం వెబ్ సైట్ ecil.co.in పరిశీలించగలరు.