Jobs : ఎన్ఎమ్డిసి లో ఉద్యోగాల భర్తీ

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.nmdc.co.in/ వెబ్ సైట్ ను సంప్రదించాలి.

Nmdc

Jobs : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ మైనింగ్ డవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఎగ్జిగ్యూటివ్ ట్రైనీ విభాగంలో మొత్తం 29 ఖాళీలు భర్తీ చేయనున్నారు. విభాగాల వారిగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే ఎలక్ట్రికల్ 6 ఖాళీలు, మెటీరియల్ మేనేజ్మెంట్ 9ఖాళలు, మెకానికల్ 10 ఖాళీలు, మైనింగ్ 4 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

గేట్ 2021 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయిన వారికి ఏడాది పాటు ప్రొహిబిషన్ పిరియడ్ ఉంటుంది. ట్రైనీలకు నెలకు రూ. 50 వేల వేతనంగా అందజేస్తారు. అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి వస్తే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, పవర్ సిస్టమ్స్ అండ్ హై ఓల్టేజ్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకానికల్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మైనింగ్ మిషనరీ, మైనింగ్ ఇంజనీరింగ్ లో బీఈ, బీటెక్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.nmdc.co.in/ వెబ్ సైట్ ను సంప్రదించాలి.