Oil India
Oil India : భారత ప్రభుత్వ రంగానికి చెందిన అస్సాంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో గ్రేడ్ బి,సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను పరిశీలిస్తే మేనేజర్ 1 ఖాళీ, సూపరింటెండెంట్ ఇంజనీర్ 2 ఖాళీలు, సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీసర్ 2 ఖాళీలు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ 1ఖాళీ, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ 1 ఖాళీ, సీనియర్ ఆఫీసర్లు 43 ఖాళీలు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 5 ఖాళీలు భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలు ఎన్విరాన్ మెంట్, రేడియాలనీజీ , సివిల్, ఎలక్ట్రికల్, ఇన్ స్ట్రుమెంటేషన్, పబ్లిక్ అఫైర్స్ తదితర విభాగాల్లో ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 27 సంవత్సరాల నుండి 37 సంవత్సరా మధ్య ఉండాలి. గ్రేడ్ సీ పోస్టులకు నెలకు 80,000 నుండి 2,20,000 వరకు గ్రేడ్ బి పోస్టులకు నెలకు 60,000 నుండి 1,80,000వరకు జీతంగా చెల్లిస్తారు. పోస్టులను బట్టి స్పెషలైజేషన్ లో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్బీ లో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. దీంతోపాటు సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరి తేది మార్చి 15, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.oil-india.com సంప్రదించగలరు.