AP Jobs: ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిషికేషన్ విడుదల చేసింది. మొత్తం 691 పోస్టులు ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నెల 16 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 5వ తేదీతో దరఖాస్తుకు చేసుకునే గడువు ముగుస్తుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://psc.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
స్క్రీనింగ్, మెయిన్ ఎగ్జామ్ అబ్జెక్టివ్ టైప్ లో..
ఆఫ్ లైన్ ఎగ్జామ్ (ఓఎంఆర్ బేస్డ్)
స్క్రీనింగ్, మెయిన్ ఎగ్జామ్ తేదీలు త్వరలో ప్రకటన
అప్ డేట్స్ కోసం అభ్యర్థులు కమిషన్ వెబ్ సైట్ ను ఫాలో అవుతూ ఉండాలి
కమిషన్ వెబ్ సైట్ లో స్క్రీనింగ్, మెయిన్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్లు
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు – 256
పే స్కేల్ – 25,220 – 80,910
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు – 435
పే స్కేల్ – 23,120 – 74,770
అర్హత – ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష పాస్ అయ్యి ఉండాలి.