BPCL Jobs: భారత్ పెట్రోలియంలో ఉద్యోగాలు.. ఏడాదికి రూ.16 లక్షల జీతం.. ఇలా అప్లై చేసుకోండి

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL)లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది.

Jobs in Bharat Petroleum Corporation

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL)లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. ఇందులోభాగంగా జూనియర్ అండ్ అసోసియేట్ ఎగ్జిక్యూటివ్‌తో సహా అనేక పోస్టులకు నియామకాలను ప్రకటించింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు బీపీసీఎల్ అధికారిక వెబ్‌సైట్ bharatpetroleum.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలు:
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్) పోస్ట్ కోసం మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్) పోస్ట్ కోసం బి.టెక్, బిఎస్సీ (ఇంజనీరింగ్), బిఇ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు.

అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ అస్యూరెన్స్) పోస్ట్ కోసం ఆర్గానిక్, ఇనార్గానిక్, అనలిటికల్ కెమిస్ట్రీ, ఫిజికల్, ఎంఎస్సీ(కెమిస్ట్రీ) చేసి ఉండాలి.

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్స్) పోస్ట్ కోసం ఇంటర్ సీఏ, ఇంటర్ సీఎంఏలో గ్రాడ్యుయేషన్ అయ్యుండాలి.

సెక్రటరీ పోస్టుకు అప్లై చేసుకునేవారికి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. ఓబీసీ, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంది.

జీతం వివరాలు:
జూనియర్ ఎగ్జిక్యూటివ్ వార్షిక ప్యాకేజీ దాదాపు రూ. 11.86 లక్షలు

అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ వార్షిక ప్యాకేజీ దాదాపు రూ. 16.64 లక్షలు

ఎంపిక ప్రక్రియ:
ముందు అర్హత, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. తరువాత రాత పరీక్ష. తరువాత కేస్-బేస్డ్ డిస్కషన్. తరువాత గ్రూప్ టాస్క్. తరువాత ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ జరుగుతుంది.

దరఖాస్తు రుసుము:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000 ప్లస్ 180(జీఎస్టీ) ఉంటుంది. ఎస్టీ, ఎస్టీ, PwBDలకు ఎలాంటి రుసుము ఉండదు.

దరఖాస్తు ఇలా చేసుకోవాలి:
ముందుగా BPCL వెబ్‌సైట్ bharatpetroleum.inకి వెళ్లి. హోమ్‌పేజీలో బీపీసీఎల్ రిక్రూట్‌మెంట్ 2025 లింక్‌పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫిల్ చేసి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. తరువాత ఫీజు చెల్లిచాలి. ఫారమ్ ప్రింటవుట్ తీసుకోవాలి.