ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. స్టార్టింగ్ లోనే రూ.30వేల జీతం.. అప్లికేషన్, ఇంటర్వ్యూ ప్రాసెస్.. ఫుల్ డిటెయిల్స్..

నిరుద్యోగులకు శుభవార్త. ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అల్లైడ్‌ సర్వీసెస్‌ సంస్థ 393 ఉద్యోగాల భర్తీ కోసం పిలుపునిచ్చింది.

Cargo logistics

నిరుద్యోగులకు శుభవార్త. ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అల్లైడ్‌ సర్వీసెస్‌ సంస్థ 393 ఉద్యోగాల భర్తీ కోసం పిలుపునిచ్చింది. వాటిలో 227 సెక్యూరిటీ స్క్రీనర్‌ (ఫ్రెషర్‌) పోస్టులు కాగా 166 అసిస్టెంట్‌ (సెక్యూరిటీ) పోస్టులున్నాయి. అగ్రిమెంట్ ప్రక్రియలో నిర్వహించే ఈ జాబ్స్ కోసం మూడేళ్ల కాలానికి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జూన్ 30 లోగా అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. అధికారిక వెబ్ సైట్ https://www.aaiclas.aero అప్లై చేసుకోవాలని కోరారు.

అర్హతలు:
సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టులకు: అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అబ్యర్ధులు కూడా డిగ్రీ పూర్తి చేసి 55 శాతం మార్కులు సాధించి ఉండే బడుంటుంది. ఇంగ్లిష్, హిందీ చదవడం, రాయడం తెలిసి ఉండాలి. ప్రాంతీయ భాష కూడా వచ్చి ఉండాలి.
అసిస్టెంట్‌ పోస్టులకు: జనరల్‌ అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాదించాలి.

వయోపరిమితి:
సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టులకు: 01.06.2025 నాటికి 27 సంవత్సరాలు మించి ఉండకూడదు. ఎస్సీ/ఎస్టీలకు, ఓబీసీ, మాజీ సైనికోద్యోగులకు వయసు సడలింపు ఉంది.
అసిస్టెంట్‌ పోస్టులకు: 27 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు, ఓబీసీ, మాజీ సైనికోద్యోగులకు వయసు సడలింపు ఉంది.

దరఖాస్తు రుసుము:
సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టులకు: జనరల్, ఓబీసీ వారు రూ.750, ఎస్సీ/ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ వారు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
అసిస్టెంట్‌ పోస్టులకు: జనరల్, ఓబీసీ వారు రూ.500, ఎస్సీ/ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

వేతన వివరాలు:
సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టులకు: ఉద్యోగంలో చేరిన మొదటి ఏడాది రూ.30000. రెండవ ఏడాది రూ.32000. మూడవ ఏడాది రూ.34000 వరకు జీతం ఉంటుంది. పీఎఫ్, మెడికల్‌ ఇన్‌స్యూరెన్స్‌, గ్రాట్యుటీ సదుపాయాలు ఉంటాయి.
అసిస్టెంట్‌ పోస్టులకు: ఉద్యోగంలో చేరిన మొదటి ఏడాది రూ.21500. రెండవ ఏడాది రూ.22000. మూడవ ఏడాది రూ.22,500 జీతం ఉంటుంది. అదనంగా టీఏ, డీఏ, పీఎఫ్, గ్రాట్యుటీ, సెలవులు సదుపాయాలు ఉంటాయి. మెడికల్‌ ఇన్‌స్యూరెన్స్‌ కోసం ఏడాదికి రూ.10,000 వరకు అందజేస్తారు.

ఎంపిక విధానం:
సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టులకు: విద్యార్హతలు, గ్రూప్ డిస్కషన్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, తరువాత శిక్షణకు ఎంపిక చేస్తారు. అందులో ఉత్తీర్ణులైవారిని ఎంపిక చేస్తారు.
అసిస్టెంట్‌ పోస్టులకు: విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.