Bank Note Press : బ్యాంక్ నోట్ ప్రెస్ లో జూనియర్ టెక్నీషియన్ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ప్రింటింగ్ ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ (లిథో ఆఫ్ సెట్ మెషిన్ మైండర్/లెటర్ ప్రెస్ మిషిన్ మైండర్/ఆఫ్ సెట్ ప్రింటింగ్/ప్లేట్ మేకింగ్/ఎలక్ర్టోప్లేటింగ్) లేదా ఐటిఐ (ప్లేట్ మేకర్ కమ్ ఇంపోజిటర్/హ్యాండ్ కంపోజింగ్) లేదా డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి.

Junior Tenancy Vacancies in Bank Note Press

Bank Note Press : ప్రభుత్వ రంగ మినీ రత్న కంపెనీ బ్యాంక్ నోట్ ప్రెస్ లో పలు ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 జూనియర్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ప్రింటింగ్ ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ (లిథో ఆఫ్ సెట్ మెషిన్ మైండర్/లెటర్ ప్రెస్ మిషిన్ మైండర్/ఆఫ్ సెట్ ప్రింటింగ్/ప్లేట్ మేకింగ్/ఎలక్ర్టోప్లేటింగ్) లేదా ఐటిఐ (ప్లేట్ మేకర్ కమ్ ఇంపోజిటర్/హ్యాండ్ కంపోజింగ్) లేదా డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 25 ఏళ్లు మించరాదు. ఆన్ లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. వేతనం: రూ. 18,780 నుంచి రూ. 67,390 చెల్లిస్తారు.

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరితేదిగా నవంబర్ 14, 2022 నిర్ణయించారు. ఆన్ లైన్ పరీక్ష తేది: డిసెంబర్ – 2022/జనవరి – 2023. పూర్తి వివరాలకు వెబ్ సైట్:https://bnpdewas.spmcil.com పరిశీలించగలరు.