LIC Scholarship : ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ విద్యాదాన్ స్కాలర్‌షిప్స్ దరఖాస్తుకు నేటితో ముగియనున్న గడువు

స్కాలర్‌షిప్ కు దరఖాస్తు చేసుకునేవారు ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్, టెన్త్ మార్క్స్ షీట్, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్ తీసుకున్నట్టు ప్రూఫ్, అకడమిక్ ఇయర్ ఫీజ్ రిసిప్ట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

LIC Scholarship

LIC Scholarship : ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ విద్యాదాన్ స్కాలర్‌షిప్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ విద్యాదాన్ స్కాలర్‌షిప్స్ ద్వారా టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన వారికి ఈ స్కాలర్ షిప్స్ అందజేస్తారు.

READ ALSO : joana vasconcelos : నోరూరించే భవనం, చూస్తే తినేయాలనిపించే కేక్ భవనం

పదో తరగతిలో 60 శాతం లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం ఏటా రూ.3,60,000 లోపు ఉండాలి. బాలికలకు, దివ్యాంగులకు, తల్లిదండ్రులు లేని వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇంటర్మీడియట్ చదివేవారికి ప్రతీ ఏటా రూ.15,000 చొప్పున స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఇలా రెండేళ్ల పాటు స్కాలర్‌షిప్ అందజేస్తారు.

స్కాలర్‌షిప్ కు దరఖాస్తు చేసుకునేవారు ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్, టెన్త్ మార్క్స్ షీట్, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్ తీసుకున్నట్టు ప్రూఫ్, అకడమిక్ ఇయర్ ఫీజ్ రిసిప్ట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకుగాను ముందుగా విద్యార్థులు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

READ ALSO : Honey Harvesting : స్వయం ఉపాధిగా తేనెటీగల పెంపకం

దరఖాస్తు చేసుకున్నవారిని ఆన్‌ లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెప్టెంబర్ 30వ తేది లోగా ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.licindia.in. పరిశీలించగలరు.