Job Mela: మహిళలకు గుడ్ న్యూస్.. పదివ తరగతి పాసయ్యారా.. రూ.7 వేల జీతం ప్లస్ బోనస్

ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతలకు ఉద్యోగ అవకాశాల కోసం జూన్ 6 నిర్వహించే జాబ్ మేళాలో ఎల్ఐసి సంస్థలో ఖాళీగా ఉన్న ఏజెంట్ పోస్టుల భర్తీ కోసం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నాం.

Job mela in warangal

నిరుద్యోగ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అనేకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు ఉపాధి కల్పించేందుకు అనేక చోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ రంగ సంస్థలు సైతం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాయి, నిరుద్యోగులకు ఉచితంగా ఉపాధి శిక్షణను అందిస్తున్నాయి. ఈ కార్యక్రమాల వల్ల ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

ఇందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్కడి నిరుద్యోగ యువతులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల(జూన్) 6వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈమేరకుక్ హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.మల్లయ్య అధికారిక ప్రకటన చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతలకు ఉద్యోగ అవకాశాల కోసం ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. ఈ జాబ్ మేళలాల వల్ల ఎంతోమంది నిరుద్యోగ యువతీ, యువకులు ఉద్యోగాలు పొందారు. అదేవిదంగా ఈనెల జూన్ 6 నిర్వహించే జాబ్ మేళాలో ఎల్ఐసి సంస్థలో ఖాళీగా ఉన్న ఏజెంట్ పోస్టుల భర్తీ కోసం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నాం. ఇందుకు పదవ తరగతి పాసైన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. మహిళా అభ్యర్థుల వయస్సు కూడా 18 నుంచి 60 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలని సూచించారు.

ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఎంపికైన అభ్యర్థులు ఫుల్ టైం, పార్ట్ టైం ఏజెంట్‌గా పని చేసుకునే అవాకాశం ఉంటుందని అన్నారు. వారికి నెలకు రూ.7000 జీతం స్టైఫండ్‌తో పాటు బోనస్ కూడా అందజేస్తారని, అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్, ఆధార్ కార్డు, బయోడేటా, పాస్ ఫోటోలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇక ఈ జాబ్ మేళా వరంగల్ నగరంలోని ములుగు రోడ్డు వద్ద గల ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో జూన్ 6వ తేదీ ఉదయం 11 గంటలకు మొదలవుతుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం హెల్ప్ లైన్ నంబర్ 78933 94393 సంప్రదించాలి సూచించారు.