L&t Scholarships
L&T : ఎల్&టీ సంస్ధ బిల్డ్ ఇండియా పేరుతో స్కాలర్ షిప్ లు అందిస్తోంది. కన్ స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ లో ఎంటెక్ చదువుతున్న విద్యార్ధులకు ఈ స్కాలర్ షిప్ లను అందిచనున్నారు. 2022 విద్యాసంవత్సరంలో కోర్ సివిల్, కోర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ స్కాలర్ షిప్ లకు అర్హులు.
స్కాలర్ షిప్ లకు ఎంపికకు ఆన్ లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్ నెస్ టెస్ట్ విధానాన్ని అనుసరించనున్నారు. 24నెలలపాటు కొనసాగు ఈకోర్సుకు నెలకు 13,400 చొప్పున స్కాలర్ షిప్ ను అందిస్తారు.
కోర్సును పూర్తి చేసిన వారికి ఎల్&టీ సంస్ధ లో ఉద్యోగ అవకాశం కల్పించనున్నారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేది మార్చి 31, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ WWW.intecc.com సంప్రదించగలరు.