తెలంగాణ టెన్త్ పరీక్షల ఫలితాలను ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఇందులో జిల్లాల వారీగా 99.29% ఉత్తీర్ణతతో మహబూబాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. 99.09 శాతంతో రెండో స్థానంలో సంగారెడ్డి జిల్లా ఉంది. చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా (73.97 % ఉత్తీర్ణత) నిలిచింది.