తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు.

AP 10th Results
తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. జీపీఏ ఈ సారి తొలగించడంతో సబ్జెక్టుల వారీగా మార్కుల గ్రేడ్లు ఇచ్చారు.
ఉత్తీర్ణతకు కావాల్సిన మార్కులు వస్తే పాస్ అని మోమోపై ఉంటుంది. ఉత్తీర్ణత సాధించలేకపోతే ఫెయిల్ అని అందులో ఇచ్చారు. ఇంతకు ముందు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ విధానాన్ని పాటించిన విషయం తెలిసిందే.
టెన్త్ ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది కంటే 1.47 శాతం ఉత్తీర్ణత అధికంగా ఉంది. ప్రైవేటు స్కూళ్లలో 94.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఒక్క విద్యార్థి కూడా పాస్ కాని పాఠశాలలు రెండు ఉన్నాయి.
ప్రైవేటు స్కూళ్లలో గత ఏడాది కంటే ఈ సారి 4 శాతం అధికంగా ఉత్తీర్ణత నమోదైంది. గురుకుల పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 98.7గా ఉంది. కాగా, మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరిగాయి. పరీక్షలను 5,09,403 మంది విద్యార్థులు రాశారు.
అధికారిక వెబ్‌సైట్లు
bse.telangana.gov.in
results.bsetelangana.org
results.bse.telangana.gov.in
ఇక్కడ చెక్ చేసుకోండి..