Hyderabad Metro Jobs : హైదరాబాద్ మెట్రో రైల్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏఎంఎస్ ఆఫీసర్ కు సంబంధించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి. అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌లో 5 ఏళ్ల అనుభవం ఉండాలి. సిగ్నలింగ్ టీమ్ ఖాళీలకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి.

Hyderabad Metro Jobs : తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ మెట్రో రైల్ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాలను పరిశీలిస్తే ఏఎంఎస్ ఆఫీసర్1, సిగ్నలింగ్ టీమ్ 2, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ 6, ట్రాక్స్ టీమ్ లీడర్ 2, ఐటీ ఆఫీసర్ 1 ఖాళీ ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏఎంఎస్ ఆఫీసర్ కు సంబంధించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి. అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌లో 5 ఏళ్ల అనుభవం ఉండాలి. సిగ్నలింగ్ టీమ్ ఖాళీలకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి.

అలాగే రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ కు సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి. ట్రాక్స్ టీమ్ లీడర్ పోస్టుకు గాను సివిల్, మెకానికల్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 4 నుంచి 7 ఏళ్ల అనుభవం ఉండాలి. ఐటీ ఆఫీసర్ ఉద్యోగాలకు బీటెక్, ఎంసీఏ, ఎంఎస్‌సీ పాస్ కావాలి. 1 నుంచి 2 ఏళ్ల అనుభవం ఉండాలి.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.ltmetro.com/careers/ పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు