Cap Gemini Jobs
CAPGEMINI JOBS : ప్రముఖ ఫ్రెంచ్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & కన్సల్టింగ్ కంపెనీ క్యాప్‌జెమినీ సంస్ధ భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది.2019 నుండి 2021 సంవత్సరాలో ఉత్తీర్ణత సాధించిన టెక్నికల్, మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఇందుకు గాను ఎక్సెల్లర్ డైవర్సిటీ ఆఫ్-క్యాంపస్ డ్రైవ్ ను నిర్వహించనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఎక్సెల్లర్ డైవర్సిటీ ఆఫ్-క్యాంపస్ డ్రైవ్‌లో ప్రస్తుతం మహిళా అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకోనున్నారు.
2019/2020/2021లో ఎంసీఏ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మహిళా అభ్యర్ధులు మాత్రమే ఈ జాబ్స్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంది. ఈ జాబ్ ప్రక్రియకు హాజరయ్యే సమయంలో అభ్యర్థికి ఎలాంటి బ్యాక్‌లాగ్ ఉండకూడదు. ఇండియాలోని క్యాప్‌జెమిని ఆఫీస్ లొకేషన్‌లలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. షిఫ్ట్‌లలో వారిగా పనిచేసేందుకు సిద్దమైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగంలో చేరే సమయంలో సర్వీస్ లెవెల్ ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది.
క్యాప్‌జెమినీ ఇండియాలో చేరిన ఉద్యోగులు తాము అనుకున్న భవిష్యత్తును క్రియేట్ చేసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం, క్యాప్‌జెమినీలో బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, కోయంబత్తూర్, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, నోయిడా, పూణే, సేలం, తిరుచిరాపల్లిలో 150,000 మంది పని చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మేల్ క్యాండిడేట్స్ కోసం కంపెనీ త్వరలో చేపట్టే నియామకాలగాను అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://www.capgemini.com/careers/job-search/పరిశీలించగలరు.