MCC NEET PG 2024 Counselling Schedule Out
MCC NEET PG 2024 Counselling : మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. నీట్ పీజీ 2024కి అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ (mcc.nic.in)లో కౌన్సెలింగ్ కోసం అధికారిక షెడ్యూల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టైమ్‌టేబుల్ ప్రకారం.. నీట్ పీజీ 2024 కౌన్సెలింగ్ రౌండ్ 1 రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 20న ప్రారంభం కాగా ఈ నెల (నవంబర్) 17, 2024న ముగుస్తుంది.
NEET PG 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?
నీట్ పీజీ అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (mcc.nic.in) నుంచి షెడ్యూల్ ఫుల్ నీట్ పీజీ 2024 కౌన్సెలింగ్ వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నీట్ పీజీ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ డౌన్‌లోడ్ డైరెక్ట్ లింక్ :
ఎంసీసీ నవంబర్ 20, 2024న నీట్ పీజీ 2024 కౌన్సెలింగ్ రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్స్ ప్రకటిస్తుంది. రౌండ్ 1లో సీట్లు కేటాయించే అభ్యర్థులు తప్పనిసరిగా నవంబర్ 21 నుంచి నవంబర్ 27, 2024 మధ్య కేటాయించిన కాలేజీలలో రిపోర్ట్ చేయాలి.
నీట్ పీజీ కౌన్సెలింగ్ రౌండ్ 2 :
నీట్ పీజీ 2024 కౌన్సెలింగ్ రౌండ్ 2 రిజిస్ట్రేషన్ డిసెంబర్ 4న ప్రారంభమవుతుంది. అభ్యర్థులు డిసెంబర్ 9, 2024లోపు దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయాలి. రౌండ్ 2లో సీట్లు పొందిన అభ్యర్థులు డిసెంబర్ 12, 2024న కేటాయించిన కాలేజీలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024 : ప్రవేశానికి అవసరమైన డాక్యుమెంట్లు :
మాస్టర్ ఆఫ్ సర్జరీ (MS), డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (MD), డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (DNB), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ఆల్ ఇండియా కోటా (AIQ) సీట్లలో ప్రవేశం కోరుకునే అభ్యర్థులకు నీట్ పీజీ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
Read Also : iPhone SE 4 Launch : ఆపిల్ ఐఫోన్ SE 4 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?