iPhone SE 4 Launch : ఆపిల్ ఐఫోన్ SE 4 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
iPhone SE 4 Launch : 2025 ప్రారంభంలో సరసమైన ఐఫోన్ వెర్షన్ లాంచ్ అవుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

iPhone SE 4 Launch Details Tipped
iPhone SE 4 Launch : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ రాబోతుంది. 2025 ప్రారంభంలో సరసమైన ఐఫోన్ వెర్షన్ లాంచ్ అవుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి, ఆపిల్ నుంచి ఇప్పటివరకు అతిపెద్ద ఐఫోన్ ఎస్ఈ అప్‌గ్రేడ్ కావచ్చు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఆపిల్ క్యూ1 2025 ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ కోసం ప్లాన్ చేస్తుందని సూచిస్తుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య ఈ లాంచ్ ఉండవచ్చు. గత ఎస్ఈ మోడల్‌లు దాదాపు అదే సమయంలో లాంచ్ అయ్యాయి. రాబోయే ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్‌కు కూడా అదే సమయంలో లాంచ్ కావొచ్చునని నివేదికలు సూచిస్తున్నాయి.
ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, కొత్త కెమెరా కంట్రోల్ బటన్‌కు సపోర్టు అందించనున్నాయి. ఐఫోన్ 16 సిరీస్ తరహాలో ఐఫోన్ ఎస్ఈ మోడల్ కూడా 2025 ఏడాదిలో ఆపిల్ అతిపెద్ద అప్గ్రేడ్లలో ఒకటిగా మారనుంది. ఐఫోన్ 14 వంటి డిజైన్, ఫీచర్లతో ఐఫోన్ ఎస్ఈ మోడల్ వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. కొనుగోలుదారులు ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ అప్గ్రేడ్లను అందుకోవచ్చు. ఆపిల్ అన్ని ప్రొడక్టుల కోసం ఎల్సీడీ నుంచి ఓఎల్ఈడీకి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇంకా లాంచ్ చేయని ఐఫోన్ ఎస్ఈ 2025 మోడల్‌ను కలిగి ఉండవచ్చు.
2025 నాటికి శాంసంగ్, ఎల్జీ, బీఈఓ వంటితో ఆపిల్ మోడల్‌ల కోసం ఓఎల్ఈడీ ప్యానెల్లను అందించనుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. రాబోయే ఐఫోన్ ఎస్ఈ మోడల్ ఆపిల్ నుంచి ఏఐ ఫీచర్లకు సపోర్టు అందిస్తుంది. ఐఫోన్ A17 ప్రో లేదా A18 చిప్సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. ఈ ఐఫోన్ డివైజ్ 48ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. 6జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే.. యూఎస్బీ సికి కూడా సపోర్టు అందిస్తుంది.
Read Also : Xiaomi 15 Pro Launch : భారీ బ్యాటరీతో షావోమీ కొత్త సిరీస్ వచ్చేస్తోంది.. కీలక స్పెషిఫికేషన్లు ఇవే..!