Xiaomi 15 Pro Launch : భారీ బ్యాటరీతో షావోమీ కొత్త సిరీస్ వచ్చేస్తోంది.. కీలక స్పెషిఫికేషన్లు ఇవే..!

Xiaomi 15 Pro Launch : రాబోయే షావోమీ 15 ప్రోలో 5ఎక్స్ టెలిఫోటో కెమెరా, 6,100mAh బ్యాటరీతో సహా రెండు డివైజ్‌లకు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్‌లను కంపెనీ ధృవీకరించింది. 

Xiaomi 15 Pro Launch : భారీ బ్యాటరీతో షావోమీ కొత్త సిరీస్ వచ్చేస్తోంది.. కీలక స్పెషిఫికేషన్లు ఇవే..!

Xiaomi 15 Pro

Updated On : October 28, 2024 / 5:41 PM IST

Xiaomi 15 Pro Launch : షావోమీ 15 సిరీస్ కంపెనీ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లను రేపు (మంగళవారం) చైనాలో లాంచ్ చేయనుంది. షావోమీ 15, షావోమీ 15 ప్రో సిరీస్ పేరుతో ఈ రెండు ఫోన్లను ప్రవేశపెట్టనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లైనప్ క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రానున్న ప్రపంచంలోని ఫస్ట్ హ్యాండ్‌సెట్‌గా చెప్పవచ్చు. లాంచ్‌కు ముందు, షావోమీ 15 ప్రోలో 5ఎక్స్ టెలిఫోటో కెమెరా, 6,100mAh బ్యాటరీతో సహా రెండు డివైజ్‌లకు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్‌లను కంపెనీ ధృవీకరించింది.

షావోమీ 15 సిరీస్ స్పెసిఫికేషన్‌లు :
చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ప్రకారం.. షావోమీ 850Wh/L శక్తి సాంద్రతతో 6,100mAh బ్యాటరీతో షావోమీ 15 ప్రో వస్తుందని తెలిపింది. షావోమీ 14ప్రో కన్నా 38 శాతం అప్‌గ్రేడ్, బ్యాటరీ సామర్థ్యం 4,880mAh కలిగి ఉంది. అదనంగా, ఈ హ్యాండ్‌సెట్ 2కె మైక్రో-కర్వ్డ్ స్క్రీన్‌తో అమర్చి ఉంటుంది.

కస్టమైజడ్ M9 మెటీరియల్‌ని కలిగి ఉంది. 1.38ఎమ్ఎమ్ బెజెల్స్, 3,200నిట్స్ గరిష్ట ప్రకాశంతో పనిచేస్తుంది. మొత్తం విద్యుత్ వినియోగాన్ని 10 శాతం తగ్గిస్తుంది. షావోమీ 15 ప్రో మోడల్ 5ఎక్స్ పెరిస్కోప్ కెమెరా సౌజన్యంతో 10ఎక్స్ లాస్‌లెస్ జూమ్ ఫీచర్ నుంచి ప్రయోజనం పొందుతుంది. ఈ రెండు ఫోన్‌లలోని కెమెరా యూనిట్ మళ్లీ లైకా బ్రాండింగ్‌ని కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.

షావోమీ 15, షావోమీ 15 ప్రో రెండూ కంపెనీ హైపర్‌కోర్ టెక్నాలజీతో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తాయి. గత వెర్షన కన్న 45 శాతం పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అలాగే, విద్యుత్ వినియోగాన్ని 52 శాతం తగ్గిస్తుంది. అధికారిక సమాచారం ప్రకారం.. షావోమీ 15 సిరీస్ 42.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కొనసాగిస్తూనే సెకనుకు 59.4 ఫ్రేమ్‌ల (fps) ఫ్రేమ్ రేట్‌ను అందిస్తుంది.

Read Also : iPhone 15 Pro : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై రూ.30,901 డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?