PG మెడికల్ సీట్లలో EWS సీట్లకు అనుమతి

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 09:28 AM IST
PG మెడికల్ సీట్లలో EWS సీట్లకు అనుమతి

Updated On : April 11, 2019 / 9:28 AM IST

పేదలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే EWS కోటా కింద  PG మెడికల్ సీట్లలో 10% సీట్లను కేటాయిస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది.  ప్రభుత్వం ఇందుకు ఆడర్ కూడా జారీచేసింది. అయితే వచ్చే విద్యాసంవత్సరం (2020-21) నుంచి ఈ పెంపు వర్తిస్తుందని MCI తెలిపింది. అయితే పెంచిన సీట్లకు అనుగుణంగా మెడికల్ కాలేజీల్లో టీచింగ్ స్టాఫ్, శిక్షణ, పడకలు, తదితర సదుపాయాలను కల్పించుకోవాలని కోరుతూ అన్ని రాష్ట్రాల వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శులకు MCI లేఖ పంపించింది. 

తెలంగాణలో ప్రస్తుతం గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో 706 PG సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే సీట్ల సంఖ్య 10 శాతం పెరగడంతో అదనంగా 71 సీట్లు పెరగనున్నాయి. MBBS సీట్లకు ఇదే విధానాన్ని వర్తింపజేస్తారని, దీంతో ప్రస్తుతమున్న 1,150 MBBS సీట్లకు అదనంగా మరో 115 సీట్లు పెరిగే అవకాశం ఉంది.