Medical Officer Jobs: వైద్యశాఖలో ఉద్యోగాలు.. రూ.52 వేల జీతం.. మొదలైన రిజిస్ట్రేషన్.. పూర్తి వివరాలు
Medical Officer Jobs: కరీంనగర్ జిల్లా విద్యార్థుకు జాతీయ ఆరోగ్య మిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పని చేసేందుకు వైద్య విద్య పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
- V Santhosh Kumar
- Published On : July 9, 2025 / 10:28 AM IST
Medical officer jobs in Karimnagar
కరీంనగర్ జిల్లా విద్యార్థుకు జాతీయ ఆరోగ్య మిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పని చేసేందుకు వైద్య విద్య పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం మూడు మెడికల్ ఆఫీసర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయనున్నారు. ఈమేరకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
విద్యార్హత: ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్, రీజినల్ విత్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఐదు సంవత్సరాలు, అంగవైకల్యం ఉన్నవారికి పది సంవత్సరాల వయసు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ముందుగా అర్హత పరీక్ష ఉంటుంది. అందులో సాధించిన మార్కులు, వెయిటేజ్ ప్రతిపాదికన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎంపిక జరుగుతుంది.
వేతన వివరాలు: ఈ జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.52 వేల జీతం అందుతుంది.
కావలసిన ధ్రువపత్రములు: తగిన విద్యార్హతల సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, లోకల్ స్టేటస్, ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకు స్కూల్ స్టడీ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
దరఖాస్తు గడువు: అభ్యర్థులు జూలు 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జిల్లా ఆరోగ్యశాఖ అధికారి కరీంనగర్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్లు అధికారిక వెబ్ సైట్ Karimnagar.telangana. gov.in లో అందుబాటులో ఉంటాయి.
