Mega job mela in tirupati
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో జులై 11న మెగా జాబ్ మేళా జరుగనుందని అధికారులు ప్రకటించారు. మొత్తం 11 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్న ఈ మేళాలో ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్తలను ఎంపిక చేయనున్నారు. కాబట్టి.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://naipunyam.ap.gov.in/view-all-jobmela ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ మేళా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, శ్రీకాళహస్తీ, తిరుపతి జిల్లాలో జరుగుతుంది. ఏదైనా సందేహాల కోసం పోన్ నం: 8074919939 ను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
కార్బన్ మొబైల్స్ పోస్టులు 30
హీరో మోటో కార్పొరేషన్ పోస్టులు 30
శ్రీ రామ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పోస్టులు 20
ముతూట్ ఫైనాన్స్ లిమిటెడ్ పోస్టులు 30
అపోలో పార్మసీ పోస్టులు 30
టీం లీజ్ పోస్టులు 30
కాల్మన్ సర్వీస్ పోస్టులు 30
డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ పోస్టులు 30
యువశక్తి ఫౌండేషన్ పోస్టులు 30
గ్రీన్ టెక్ ఇన్సూరెన్స్ పోస్టులు 30
NS ఇన్స్ట్రుమెంట్స్ పోస్టులు 30