Mega job fair in Anantapur for the unemployed
నిరుద్యోగులకు శుభవార్త. జాబ్ మేళాల ద్వారా ఇప్పటికే కొన్ని లక్షల మంది ఉపాధి పొందగా ఇప్పుడు మరోసారి భారీ జాబ్ మేళా జరుగనుంది. అనంతపురం జిల్లాలోని నార్పల, సింగనమల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ జాబ్ మేళా జరుగనుందని జిల్లా అధికారులు తెలియజేశారు. ఆగస్టు 19వ తేదీన ఉదయం 9 గంటలకు మొదలుకానున్న ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ సంస్థలు పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. కాబట్టి, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఈ జాబ్ మేళా గురించి మరిన్ని వివరాల కోసం 9010039901 నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలియజేశారు.