విశాఖ జిల్లా నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జూలై 21న జాబ్ మేళా జరుగనుంది. ఈమేరకు కంచరపాలెం పాలిటెక్నికల్ కళాశాలలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి కె. శాంతి అధికారిక ప్రకటన చేశారు. ఇప్పటికే పలు జాబ్ మేళాల ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని, జులై 21న జరుగనున్న జాబ్ మేళా కోసం వివిధ కంపెనీలతో మాట్లాడి మంచి అవకాశాలను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఇక ఈ జాబ్ మేళాలో 10 కి పైగా ప్రైవేట్ బ్యాంక్, మెడికల్ సంస్థలు పాల్గొంటాయని, 1000 పోస్టుల వరకు భర్తీ చేయనున్నారని తెలిపారు.
విద్యార్థతలు:
ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ, డిప్లొమా, బి.టెక్ , ఎలక్ట్రికల్ ఎనర్జీ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇలా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఉద్యోగం చేయు స్థలం:
ఎంపిక అయిన అభ్యర్థులు విశాఖపట్నం, తూర్పుగోదావరి, అనకాపల్లి , హైదరాబాద్, పరవాడ, అచ్చుతాపురం, విజయనగరంలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.
ఆసక్తి గల యువతి , యువకులు అధికారక వెబ్ సైట్ naipunyam.ap.gov.in లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. సోమవారం జులై 21 ఉదయం 10 గంటలకు ఈ జాబ్ మేళా మొదలుకానుంది.