×
Ad

Job Mela: రేపే మెగా జాబ్ మేళా.. విప్రో, యాక్సిస్ సంస్థల్లో 450 పైగా ఉద్యోగాలు.. అస్సలు మిస్ అవకండి

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. చిత్తూరు జిల్లాలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరో మెగా జాబ్ మేళా(Job Mela) జరుగనుంది.

Mega Job Mela on September 2nd in Chittoor district

Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. చిత్తూరు జిల్లాలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరో మెగా జాబ్ మేళా జరుగనుంది. సెప్టెంబర్ 2వ తేదీన జరుగనున్న ఈ జాబ్‌మేళాలో పది ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ జాబ్ మేళ ద్వారా మొత్తం 450 పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కాబట్టి, నిరుద్యోగులకు ఇది గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు తప్పకుండా ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని నిర్వాహకులు సూచించారు. ఈ జాబ్ మేళా(Job Mela) గురించి మరిన్ని వివరాల కోసం ఈ నంబరును 8465830771 సంప్రదించవచ్చని సూచించారు.

తెలంగాణలో లోకల్ కోటా, స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. విద్యార్థులు, తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్..

సంస్థలు, ఉద్యోగ వివరాలు:

భారత ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ 50 పోస్టులు

అపోలో ఫార్మసీ 50 పోస్టులు

అమరరాజా 50 పోస్టులు

AU చిన్న ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ 30 పోస్టులు

అండ్రోమెడా BPO ప్రైవేట్ లిమిటెడ్ 30 పోస్టులు

వెంకట్ HR సేవలు 40 పోస్టులు

టాటా ఎలక్ట్రానిక్స్ 50 పోస్టులు

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 50 పోస్టులు

యాక్సిస్ బ్యాంక్ 50 పోస్టులు

విప్రో 50 పోస్టులు