MSDE to conduct 250 National Apprenticeship Awareness Workshops
MSDE: అప్రెంటిస్‌షిప్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటుగా భారతీయ యువత అప్రెంటిస్‌షిప్‌ను స్వీకరించేలా చేయడానికి నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్ధాపక మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డీఈ) దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 250కు పైగా వర్క్‌షాప్‌లను నిర్వహించనుంది. వీటి ద్వారా సంస్థలు, ఔత్సాహికులు, భాగస్వాముల నడుమ అప్రెంటిస్‌షిప్ సంస్కరణల పట్ల అవగాహన కల్పించనున్నారు. రీజనల్ డైరెక్టోరేట్, స్కిల్ డెవలప్‌మెంట్ మరియు ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ (ఆర్‌డీఎస్‌డీఈ)సంబంధిత ప్రాంతాలలో ఈ కార్యక్రమాలను నిర్వహించనుంది.
Adani Group: అదానీ గ్రూప్సులో భారీ క్రాష్.. ఒక్కసారిగా కుప్పకూలిన షేర్లు.. అయోమయంలో దలాల్ స్ట్రీట్
ఈ కార్యక్రమం గురించి ఎంఎస్‌డీఈ కార్యదర్శి అతుల్ కుమార్ తివారీ మాట్లాడుతూ అప్రెంటిస్‌షిప్ సంస్కరణలతో ప్రతిభావంతుల అవసరాలతో పాటుగా సుశిక్షితులైన యువత కోరుకునే పరిశ్రమ అవసరాలు సైతం తీరతాయని అన్నారు. అప్రెంటిస్‌షిప్ చట్టంలో మార్పులు కారణంగా మన యువత అత్యుతమ శిక్షణ పొందగలరని అన్నారు. ఈ తరహా వర్క్‌షాప్‌లను ఫిబ్రవరి 2,3 తేదీలలో నిర్వహించనున్నారు. మొదటి రోజు వర్క్‌షాప్‌ను కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్దనిర్వహించనున్నారు. దీనిలో కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు, డీఈటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ శిక్షణా సంస్థలు (ఐటీఐలు), ఎంఎస్‌ఎంఈలు, బోట్, జన్ శిక్షణ్ సంస్ధాన్ (జెఎస్‌ఎస్‌లు), నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి కార్పోరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ (ఎస్‌ఎస్‌సీలు) పాల్గొన్నారు.
Ukraine: యుక్రెయిన్‌కు భారీ సాయం ప్రకటించిన అమెరికా.. ఆయుధాల సరఫరాకు అంగీకారం
తొలి రోజు వర్క్‌షాప్‌ను ఐఎస్‌డీఎస్, రీజనల్ డైరెక్టర్ (ఏపీ అండ్ టీఎస్) కే.శ్రీనివాస్‌రావు ప్రారంభించనున్నారు. రెండవ రోజు వర్క్‌షాప్ కంచరపాలెంలోని ఐటీఐ వద్ద జరుగనుంది. ఐటీఐలతో పాటుగా ఇతర వొకేషనల్ కోర్సుల ట్రైనీలకు శిక్షణ అందించనున్నారు. ఈ వర్క్‌షాప్‌ను ఎంఎస్‌డీఈ, ఎన్‌ఎస్‌డీసీ, నిమి, ఎంఎస్‌ఎంఈ, డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ (డీఐ), ఆర్‌డీఎస్‌డీఈల మార్గనిర్దేశకత్వంలో నిర్వహిస్తున్నారు.