Adani Group: అదానీ గ్రూప్సులో భారీ క్రాష్.. ఒక్కసారిగా కుప్పకూలిన షేర్లు.. అయోమయంలో దలాల్ స్ట్రీట్

అదానీ టోటల్ గ్యాస్ (10 శాతం క్షీణత), అదానీ పవర్ (4.98 శాతం క్షీణత), అదానీ విల్మార్ (5 శాతం క్షీణత), ఎన్‌డిటివి (5 శాతం తగ్గుదల) నమోదు చేసుకున్నాయి. ఇవే కాకుండా, అదానీ ట్రాన్స్‌మిషన్ దాదాపు 9 శాతం పడిపోయింది. అదానీ గ్రీన్ ఎనర్జీ 9 శాతానికి పైగా పడిపోయింది. అదానీకి చెందిన సిమెంట్ సంస్థలు అంబుజా సిమెంట్ (14 శాతం క్షీణత), ఏసీసీ (5 శాతం తగ్గుదల) కూడా భారీగా పడిపోయాయి.

Adani Group: అదానీ గ్రూప్సులో భారీ క్రాష్.. ఒక్కసారిగా కుప్పకూలిన షేర్లు.. అయోమయంలో దలాల్ స్ట్రీట్

Adani Group shares face carnage on Dalal Street

Adani Group: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-బడ్జెట్ సమర్పించిన అనంతరం మార్కెట్ సూచీలు దూసుకుపోతుంటే అదానీ గ్రూప్ మాత్రం ఢీలా పడిపోంది. బడ్జెట్ ప్రసంగం పూర్తవ్వగానే బెంచ్‌మార్క్ స్టాక్ సూచీలలో అదానీ గ్రూప్ షేర్లు భారీ అస్థిరతను నమోదు చేసుకున్నాయి. అదానీ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ సంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ 26.70 శాతం పతనమైంది. 20,000 కోట్ల రూపాయల ఎఫ్‭పీఓ విజయవంతంగా పూర్తైన ఒక రోజు అనంతరం ఇలాంటి పరిణామం ఎదురు కావడంతో దలాల్ స్ట్రీట్‌లో భయాందోళనల నెలకొంది.

#UnionBudget 2023 : బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంది..ఎన్నో ప్రోత్సాహాలు ప్రకటించాం : ప్రధాని మోడీ

మధ్యాహ్నం 3 గంటల సమయంలో, ఎస్ అండ్ పీ, బీఎస్ఈ సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా క్షీణించగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 501.2 శాతానికి పైగా పడిపోయింది. అయితే, రెండు బెంచ్‌మార్క్‌లు కొద్దిసేపటికే ఊపందుకున్నాయి. అయితే అదానీ గ్రూప్ స్టాక్స్ ఇందుకు విరుద్ధంగా పతనం వైపుకు వెళ్లాయి. దీంతో మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. అదానీ గ్రూపునకు చెందిన 10 లిస్టెడ్ కంపెనీల పతనం స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. 10 అదానీ గ్రూప్ స్టాక్‌లలోని నాలుగు కంపెనీలు మధ్యాహ్నం 3 గంటల సమయానికి లోయర్ సర్క్యూట్‌లను తాకాయి.

#Budget2023: కేంద్ర బడ్జెట్-2023లోని 7 లక్ష్యాలు.. సప్తర్షిగా వర్ణించిన ఆర్థికమంత్రి నిర్మల

అదానీ టోటల్ గ్యాస్ (10 శాతం క్షీణత), అదానీ పవర్ (4.98 శాతం క్షీణత), అదానీ విల్మార్ (5 శాతం క్షీణత), ఎన్‌డిటివి (5 శాతం తగ్గుదల) నమోదు చేసుకున్నాయి. ఇవే కాకుండా, అదానీ ట్రాన్స్‌మిషన్ దాదాపు 9 శాతం పడిపోయింది. అదానీ గ్రీన్ ఎనర్జీ 9 శాతానికి పైగా పడిపోయింది. అదానీకి చెందిన సిమెంట్ సంస్థలు అంబుజా సిమెంట్ (14 శాతం క్షీణత), ఏసీసీ (5 శాతం తగ్గుదల) కూడా భారీగా పడిపోయాయి. అదానీ గ్రూప్ స్టాక్స్ వాల్యుయేషన్‌లో భారీ పతనం భారతీయ మార్కెట్లపై ప్రభావం చూపింది.