#Budget2023: కేంద్ర బడ్జెట్-2023లోని 7 లక్ష్యాలు.. సప్తర్షిగా వర్ణించిన ఆర్థికమంత్రి నిర్మల

వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2023-24లో భారత జీడీపీ 6 నుంచి 6.8 శాతం వరకు పెరుగుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (7 శాతం)తో పోలిస్తే కాస్త తక్కువే. కోవిడ్ మహమ్మారి నుంచి భారతదేశం ఆర్థికంగా కోలుకోవడం పూర్తయిందని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 6 శాతం నుంచి 6.8 శాతం వరకు వృద్ధి చెందుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది.

#Budget2023: కేంద్ర బడ్జెట్-2023లోని 7 లక్ష్యాలు.. సప్తర్షిగా వర్ణించిన ఆర్థికమంత్రి నిర్మల

Here Are Saptarshi, The 7 Priorities Of Union Budget

#Budget2023: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బుధవారం సాధారణ బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీ-2.0 ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. కాగా, ఈ బడ్జెట్‭లో ప్రభుత్వం ఏడు లక్ష్యాలను ప్రధానంగా ఎంచుకున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ఏడు లక్ష్యాలను ఆమె ‘సప్తర్షి’గా పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తాజా బడ్జెట్‭ను ‘అమృత కాల్’ బడ్జెట్‭గా ఆమె పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి నిర్మల పేర్కొన్న 7 ప్రధాన లక్ష్యాలు
1. కలుపుగోలు అభివృద్ధి
2. చివరి మైలును అందుకోవడం
3. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు
4. సంభావ్యతను వదులుకోవడం
5. పచ్చదనం పెరుగుదల
6. యువశక్తికి ప్రాధాన్యం
7. ఆర్థిక రంగం

ఈ ఏడు లక్ష్యాలను దేశాన్ని అమృత కాలం వైపుకు తీసుకెళ్తాయని బడ్జెట్ ప్రసంగంలో నిర్మల అన్నారు. మరో 25 ఏళ్లలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు కానుంది. అయితే ఈ 25 ఏళ్లలో దేశాన్ని మరింత శక్తివంతంగా తీర్చి దిద్దాలనే లక్ష్యాన్ని మోదీ ప్రభుత్వం పెట్టుకుంది. దేశంలో తదుపరి లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్-మే 2024లో జరగనున్నందున ఈ ఏడాది బడ్జెట్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మంగళవారం రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. అనంతరం 2022-23 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. రాబోయే ఆర్థిక సంవత్సరం (2023-24) వార్షిక బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి అధికారిక కసరత్తు అక్టోబర్ 10న ప్రారంభమైంది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2023-24లో భారత జీడీపీ 6 నుంచి 6.8 శాతం వరకు పెరుగుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 శాతం, 2021-22లోని 8.7 శాతంతో పోలిస్తే కాస్త తక్కువే. కోవిడ్ మహమ్మారి నుంచి భారతదేశం ఆర్థికంగా కోలుకోవడం పూర్తయిందని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 6 శాతం నుంచి 6.8 శాతం వరకు వృద్ధి చెందుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది.