Job Vacancies
Job Vacancies : ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRVC)లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 20 ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీల నియామకాన్ని చేపట్టనున్నారు. ఆసక్తి మరియు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
READ ALSO : NABARD Jobs : వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ లో పలు పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే అభ్యర్ధులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్.సి, ఎస్టీలకు 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
READ ALSO : Drones In Agriculture : డ్రోన్, వరినాటే యంత్రాలకు.. సబ్సిడీ 50 శాతం
అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు వేతనంగా 40,000ల నుండి 1,40,000వరకు చెల్లిస్తారు. 25/09/2023 నుండి 29/09/2023 వరకు ఇంటర్వ్యూ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూ ప్రక్రియ జరిగే ప్రదేశం చిరునామా ; మేనేజర్ (HR), MRVC కార్పొరేట్ ఆఫీస్, 2వ అంతస్తు, చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్ బిల్డింగ్, ముంబై 400020. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://mrvc.indianrailways.gov.in. పరిశీలించగలరు.