National Means Cum Merit Scholarship 2025
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు గుడ్ న్యూస్. చదువుకోవాలని ఆసక్తి ఉంది ఆర్తికంగా ఇబ్బంది పడుతున్న వారికి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(NMMS) ను అందిస్తున్నారు. ఈమేరకు పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ పథకంలో భాగంగా ప్రతీ సంవత్సరం లక్ష మంది విద్యార్థులకు ఏడాదికి రూ.12 వేల చొప్పున స్కాలర్షిప్ అందించనున్నారు. ఇది 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కొనసాగుతుంది. కాబట్టి, ఇది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మంచి అవకాశంగా అధికారులు చెప్తున్నారు. కాబట్టి, ఆసక్తి, అర్హత ఉన్న విధ్యార్థులు వెంటనే ఈ స్కాలర్షిప్ స్కీం ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విద్యార్థుల ఎంపిక కోసం ఆయా రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తాయి. 8వ తరగతి వారికి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్), స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్) ఉంటుంది. 8వ తరగతిలో నిర్వహించే పరీక్షకు హాజరుకావడానికి విద్యార్థులు 7 వ తరగతిలో కనీసం 55 శాతం, ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులైతే 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాదించాలి.
ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్, స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో మొత్తం 90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇవి 7, 8 తరగతుల్లో బోధించే మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల నుంచి కవర్ చేస్తారు. రెండు పరీక్షలకు 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. కనీసం 40 శాతం మార్కులతో, ఎస్సీ, ఎస్టీలకు విద్యార్థులు 32 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాదించాలి.