National Testing Agency releases UGC NET June 2025 results
యూజీసీ నెట్ జూన్ 2025 పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఈమేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక ప్రకటన చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in ద్వారా స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) అర్హత కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు.
ఈ ఏడాదికి గాను యూజీసీ నెట్ 2025 కోసం 10,19,751 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 7,52,007 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 1,28,179 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక వీరిలో జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రెండింటిలోనూ 5,269 మంది ఉత్తీర్ణత సాధించగా.. 54,885 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్డీ ప్రవేశాలకు అర్హుత సాధించారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్), విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హత కోసం యూజీసీ నెట్ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు.