NCDC Recruitment: ఎంబీఏ అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. ఢిల్లీ ఎన్‌సీడీసీలో డైరెక్టర్ జాబ్స్.. నెలకు రూ.2 లక్షల జీతం.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు

నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (NCDC Recruitment) నోటిఫికేషన్ విడుదల చేసింది.ఒప్పంద ప్రాతిపదికన చీఫ్ డైరెక్టర్

NCDC Recruitment: NCDC has released a notification for the posts of Chief Director and Deputy Director

NCDC Recruitment: ఎంబీఏ పూర్తి చేసి మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (NCDC Recruitment) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన చీఫ్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీనికి సంబదించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 31తో గడువు ముగియనుంది. కాబట్టి, అర్హులైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.ncdc.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

AAI Recruitment: గేట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఏఏఐలో 976 జాబ్స్.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు మీకోసం

ఖాళీలు, ఉద్యోగ వివరాలు:

  • చీఫ్ డైరెక్టర్ (మార్కెటింగ్) పోస్టులు 1
  • డిప్యూటీ డైరెక్టర్ (మార్కెటింగ్) పోస్టులు 1

విద్యార్హతలు:

  • చీఫ్ డైరెక్టర్ మార్కెటింగ్‌ పోస్టుల కోసం అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ, MBA/PGDM పూర్తి చేసి ఉండాలి. అలాగే అనుభవం కలిగి ఉండాలి.
  • డిప్యూటీ డైరెక్టర్ మార్కెటింగ్‌లో పోస్టుల కోసం అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ, MBA/PGDM పూర్తి చేసి ఉండాలి. అలాగే అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • చీఫ్ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.
  • డిప్యూటీ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

వేతన వివరాలు:

  • చీఫ్ డైరెక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,23,100 నుంచి రూ.2,15,900 వరకు జీతం అందుతుంది.
  • డిప్యూటీ డైరెక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700 వరకు జీతం అందుతుంది

దరఖాస్తు చిరునామా:

డైరెక్టర్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NCDC)
4-Siri, Institutional Area, House Khas, New Delhi – 110016.