NEET PG 2024 Counselling : నీట్ పీజీ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో విడుదల.. పూర్తి వివరాలివే!

NEET PG 2024 Counselling : నీట్-పీజీ 2024 ప్రొవిజనల్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రాబోయే 2 నుంచి 3 రోజుల్లో అప్‌డేట్ చేయనున్నట్టు భావిస్తున్నారు.

NEET PG 2024 Counselling Schedule

NEET PG 2024 Counselling : పోస్ట్ గ్రాడ్యుయేట్ల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET PG) కౌన్సెలింగ్ ప్రక్రియ 2024 షెడ్యూల్ త్వరలో విడుదల చేయనుందని భావిస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశ పరీక్షకు హాజరైన వారు కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి వేచి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా షెడ్యూల్‌ను యాక్సెస్ చేయగలరు. యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ అసోసియేషన్ (UDFA) జాతీయ అధ్యక్షుడు, లక్ష్య మిట్టల్ కౌన్సెలింగ్ షెడ్యూల్ గురించి అక్టోబర్ 14న వెల్లడించారు.

నీట్-పీజీ 2024 ప్రొవిజనల్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రాబోయే 2 నుంచి 3 రోజుల్లో అప్‌డేట్ చేయనున్నట్టు భావిస్తున్నారు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో విడుదలయ్యే షెడ్యూల్‌లో రిజిస్ట్రేషన్ తేదీలు, సీట్ల కేటాయింపు రౌండ్‌లు, ఛాయిస్ ఫిల్లింగ్, కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌కి నివేదించే షెడ్యూల్ వంటి వివరాలు ఉంటాయి.

అంతకుముందు, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) సెప్టెంబర్ 20న మొదటి రౌండ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. వివరణాత్మక షెడ్యూల్ ఇంకా రిలీజ్ కాలేదు. షెడ్యూల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యార్థులు నీట్ పీజీ 2024 కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి అధికారిక ఎంసీసీ పోర్టల్‌లో తమకు ఇష్టమైన కాలేజీలో కోర్సులను ఎంచుకోవచ్చు.

నీట్ పీజీ 2024 కౌన్సెలింగ్ ప్రక్రియ :
గత ట్రెండ్‌ల ఆధారంగా నీట్ పీజీ 2024 కౌన్సెలింగ్ నాలుగు దశల్లో జరుగుతుందని భావిస్తున్నారు. మొదటి రౌండ్ 1, రౌండ్ 2, మాప్-అప్ రౌండ్, ఏఐక్యూ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటాయి. నీట్రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, పరీక్ష నిర్వహణ అధికారులు సీట్ల కేటాయింపు ఫలితాలను ప్రకటిస్తారు. అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకోవచ్చు.

నీట్ పీజీ 2024 అడ్మిషన్.. అవసరమైన పత్రాలివే :

  • ఎంసీసీ నుంచి కేటాయింపు లేఖ
  • ఎన్‌బీఈ జారీ చేసిన అడ్మిట్ కార్డ్
  • ఎన్‌‌బీఈ నుంచి రిజిల్ట్స్ లేదా ర్యాంక్ లేఖ
  • ఎంబీబీఎస్/బీడీఎస్ 1వ, 2వ, 3వ ప్రొఫెషనల్ పరీక్షల నుంచి మార్క్ షీట్‌లు
  • ఎంబీబీఎస్/బీడీఎస్ డిగ్రీ లేదా ప్రొవిజనల్ సర్టిఫికెట్

ఎంఎస్, ఎండీ, డీఎన్‌బీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ఆల్ ఇండియా కోటా (AIQ) సీట్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నీట్ పీజీ కౌన్సెలింగ్ జరుగుతుంది.

Read Also : Best Camera Phones : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ. 20వేల లోపు ధరలో బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ ఎంచుకోండి!