NEET PG Counselling : నీట్ పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్.. త్వరలో రిజిస్ట్రేషన్లు ప్రారంభం!

NEET PG Counselling Schedule : పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూల్‌ని చెక్ చేయొచ్చు.

NEET PG Counselling : నీట్ పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్.. త్వరలో రిజిస్ట్రేషన్లు ప్రారంభం!

NEET PG Counselling Schedule Released

Updated On : September 10, 2024 / 11:51 PM IST

NEET PG Counselling Schedule : మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) త్వరలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) 2024 కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ షెడ్యూల్‌ను ప్రకటించింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూల్‌ని చెక్ చేయొచ్చు.

ఫైమా (FAIMA) ప్రకారం.. నీట్ పీజీ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 20న ప్రారంభమై సెప్టెంబర్ 26న ముగుస్తాయి. కౌన్సెలింగ్ ప్రక్రియ రిజిస్ట్రేషన్ల చెల్లింపు విండో మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఫైమా ఉదహరించింది.

చాయిస్ ఫిల్లింగ్ విండో సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 26 వరకు అందుబాటులో ఉంటుంది. ఎంపిక లాకింగ్ సెప్టెంబర్ 26 సాయంత్రం 4 గంటల నుంచి అదే రోజు రాత్రి 11:55 వరకు ప్రారంభమవుతుంది. సీట్ల కేటాయింపు ప్రక్రియ సెప్టెంబర్ 27 నుంచి సెప్టెంబర్ 29 మధ్య జరుగుతుంది.

మొదటి సీట్ అలాట్‌మెంట్ జాబితా ఫలితాలు సెప్టెంబర్ 30న విడుదల అవుతాయి. మొదటి జాబితా ఆధారంగా ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 8 మధ్య రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

రౌండ్ 2 కోసం రిజిస్ట్రేషన్లు అక్టోబర్ 14న ప్రారంభమై అక్టోబర్ 21న ముగుస్తాయి. రెండో రౌండ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఫలితాలు అక్టోబర్ 24న విడుదల అవుతాయి. ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 మధ్య నిర్దేశిత ప్రదేశంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

రౌండ్ 3కి సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు నవంబర్ 7 నుంచి నవంబర్ 12 వరకు నిర్వహిస్తుంది. నీట్ ఫలితాలు నవంబర్ 16న విడుదల చేస్తారు. వేకే రౌండ్‌కు నవంబర్ 28, డిసెంబర్ 2 మధ్య రిజిస్ట్రేషన్లు అవుతాయి. డిసెంబర్ 5న ఫలితాలు ప్రకటించనుంది. మెడికల్ బాడీ త్వరలో అధికారిక ఎంసీసీ వెబ్‌సైట్ (mcc.nic.in)లో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అప్‌లోడ్ చేస్తుంది.

Read Also : CBSE Board Exams 2025 : సీబీఎస్ఈ పరీక్షకు అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌కు లాస్ట్ డేట్ ఇదే.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!