NEET UG 2024 application correction window opens today
NEET UG 2024 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) UG 2024 కోసం అప్లికేషన్ కరెక్షన్ విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది. అధికారిక వెబ్‌సైట్ (nta.ac.in/medicalexam) ద్వారా ఎడిట్ ఆప్షన్ యాక్సెస్ చేయవచ్చు. నీట్ అభ్యర్థులు తమ ప్రాథమిక దరఖాస్తు సమర్పణ సమయంలో చేసిన ఏవైనా లోపాలను రివ్యూ చేయడంతో పాటు ఎడిట్ చేసేందుకు అనుమతిస్తుంది.
అప్లికేషన్ ఎడిట్ చేసే అవకాశం మార్చి 20 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ వ్యవధిలో అభ్యర్థులు తమ పేరు, చిరునామా, విద్యా అర్హతలు, పరీక్షా కేంద్ర ప్రాధాన్యతలు (నిర్దిష్ట పరిమితులతో) వంటి సమాచారాన్ని అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. అదనంగా, తమ ఆధార్ కార్డును తిరిగి అథెంటికేషన్ చేసుకోవచ్చు. నీట్ యూజీ 2024 మే 5న దేశవ్యాప్తంగా భారత్ వెలుపల 14 నగరాల్లో నిర్వహిస్తోంది. ఈ పరీక్ష పెన్, పేపర్ (ఆఫ్‌లైన్) మోడ్‌లో పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు నిర్వహించనున్నారు.
నీట్ యూజీ 2024 దరఖాస్తు ఫారమ్.. ఎలా ఎడిట్ చేయాలంటే? :
నీట్ యూజీ 2024 పరీక్ష కోసం 25 లక్షల మంది వైద్య విద్యార్థులు తమ దరఖాస్తులను సమర్పించారు. గత ఏడాది గణాంకాలతో పోలిస్తే.. 4.20 లక్షల మంది దరఖాస్తుదారులు గణనీయంగా పెరిగారు. దరఖాస్తు ఫారమ్‌లోని ఫైనల్ ఎడిట్ ఆప్షన్ అవసరమైతే.. ఏదైనా అదనపు రుసుము చెల్లించిన తర్వాత మాత్రమే వర్తిస్తాయి. జెండర్, కేటగిరీ లేదా పిడబ్ల్యుడి స్టేటస్‌లో మార్పులకు అభ్యర్థులకు తదనుగుణంగా ఏదైనా అదనపు రుసుము వసూలు చేస్తారు.