NEET UG 2024 : నీట్ యూజీ పరీక్ష అభ్యర్థులకు అలర్ట్.. 14 దేశాల్లో కొత్త పరీక్షా కేంద్రాలు.. మీకు నచ్చిన సెంటర్ ఎంచుకోవచ్చు!

NEET UG 2024 : నీట్ యూజీ పరీక్ష 2024 కోసం పరీక్షా కేంద్రాలను ఎంచుకున్న అభ్యర్థులు, విదేశీ కేంద్రాలు కాకుండా ఫీజులు చెల్లించిన అభ్యర్థులు దరఖాస్తు సవరణ దశలో పరీక్ష కేంద్రాలను మార్చుకోవచ్చు.

NEET UG 2024 _ New Exam Centers Open In 14 Countries, Check List

NEET UG 2024 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విదేశాల్లో మరిన్ని కొత్త పరీక్షా కేంద్రాలను చేర్చింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG) కోసం విదేశాల్లో నివసిస్తున్న అభ్యర్థుల నుంచి కూడా దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ ప్రవేశ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 9న ప్రారంభమైంది.

Read Also : CBSE Board Exams : టెన్త్, ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు..!

గడువు తేదీ మార్చి 9 వరకు :
అయితే, గడువు తేదీ మార్చి 9 వరకు నిర్ణయించింది. నీట్ యూజీ 2024 పరీక్ష కోసం కొత్త ఎగ్జామ్ సెంటర్లతో కూడిన మొత్తం 14 నగరాలను వెల్లడించింది. అందులో కువైట్ సిటీ, దుబాయ్, అబుదాబి, బ్యాంకాక్, కొలంబో, దోహా, ఖాట్మండు, కౌలాలంపూర్, లాగోస్, మనామా, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్‌ ఉన్నాయి.

పరీక్షా కేంద్రాలను మార్చుకోవాలంటే? :
ఇప్పటికే భారత్‌లో నీట్ పరీక్షా కేంద్రాలను ఎంచుకుని విదేశీ పరీక్ష కేంద్రాలను పరిగణనలోకి తీసుకోకుండా ఫీజులు చెల్లించిన అభ్యర్థులు నీట్ యూజీ 2024 దరఖాస్తులో మార్పులు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రం, దేశ ప్రాధాన్యతలను సరిచేసుకునే అవకాశం ఉంటుందని ఎన్‌టీఏ పేర్కొంది. అదనంగా, విదేశాల్లోని అభ్యర్థులు తమ నీట్ పరీక్షా కేంద్రాలను అంతర్జాతీయ నగరాలకు మార్చుకోవాలనుకుంటే.. దరఖాస్తు ఎడిట్ విండో సమయంలో మార్పులు చేయవచ్చు.

అయితే, ఎన్టీఏ ప్రకారం.. అందుకు అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విదేశీ దేశాల నుంచి కొత్త దరఖాస్తుదారులు దరఖాస్తు ప్రక్రియ సమయంలో డ్రాప్‌డౌన్ మెను నుంచి నేరుగా విదేశీ దేశాలను తమ పరీక్షా కేంద్రాలుగా ఎంచుకోవచ్చు. నీట్ యూజీ దరఖాస్తు ఫారమ్, సమాచార బులెటిన్, సిలబస్, పరీక్షా సరళి వంటి విషయాలను తెలుసుకోవాలంటే (neet.ntaonline.in)లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.

కొత్త వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ ప్రక్రియ :
గతంలో నీట్ యూజీ పరీక్ష కోసం అందించిన (neet.nta.nic.in) అప్లికేషన్ ఫారమ్ ఇప్పుడు కొత్త వెబ్‌సైట్ (neet.ntaonline.in) ద్వారా యాక్సెస్ అవుతుందని గమనించాలి. నీట్ యూజీ 2024 పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అనే నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) 2024 పరీక్షల కోసం నీట్ సిలబస్‌లో 2023లో స్వల్ప మార్పులు చేసింది. ఈ మార్పులు కోవిడ్-19 మహమ్మారి తర్వాత (NCERT) సిలబస్‌లో సర్దుబాట్లకు అనుగుణంగా ఉంటాయి.

Read Also : CBSE Boards Exams 2024 : సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 10వ తరగతి హిందీ రెండు పరీక్షల కోసం గైడ్‌లైన్స్ విడుదల