నీట్ యూజీ 2025 కౌన్సెలింగ్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈరోజు(జులై 21) నుంచి మొదలుకానుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంసీసీ నీట్ యూజీ 2025 కౌన్సెలింగ్ కోసం అధికారిక వెబ్ సైట్ mcc.nic.in నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికి సంబందించిన పూర్తి వివరాలు మీకోసం.
ఎంసీసీ నీట్ యూజీ కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు:
- జులై 21 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది.
- దీని గడువు 28వ తేదీతో ముగుస్తుంది..
- జులై 22 నుంచి 28 వరకు ఛాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
- జులై 29 నుంచి 30 వరకు సీట్ అలాట్‌మెంట్ ప్రక్రియ ఉంటుంది
- జులై 31న సీట్ అలాట్‌మెంట్ ఫలితాలు వెల్లడవుతాయి
- ఆగస్టు 1 నుంచి 6 వరకు రిపోర్టింగ్/జాయినింగ్ ఉంటుంది
- ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా చేరిన అభ్యర్థుల ఆగస్టు 7, 8న డేటా వెరిఫికేషన్ ఉంటుంది.
ఇక ఎంసీసీ నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ మూడు రౌండ్లలో ఉంటుంది.అనంతరం స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా ఉంటుంది.
మీ రిజల్ట్ ను ఇలా చెక్ చేసుకోండి:
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ mcc.nic.in లోకి వెళ్ళాలి
- హోమ్ పేజీలో “UG Medical” ట్యాబ్‌పై క్లిక్ చేయాలి
- కొత్త విండోలో రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది.
- ఆ లింక్‌పై క్లిక్ చేసి మీ వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫిల్ చేసి, రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి.
- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి, అప్లికేషన్ ఫార్మ్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.