NEET UG 2025 State Quota Counseling New Schedule Released
నీట్ యూజీ 2025లో కౌన్సిలింగ్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. మెడికల్ కాలేజీల్లో రాష్ట్ర కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ కు సంబందించిన కొత్త షెడ్యుల్ ను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ జూలై 21 నుంచి ప్రారంభమైతే, స్టేట్ కోటా కౌన్సెలింగ్ జులై 30 నుంచి ప్రారంభం అవ్వాలి. కానీ, కొన్ని కారణాల వల్ల కౌన్సెలింగ్ వాయిదా వేశారు. కాగా, మంగళవారం ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు చేసిన నేపథ్యంలో అధికారులు కొత్త షెడ్యూల్‌ను ప్రకటించించారు.
కౌన్సిలింగ్ కొత్త షెడ్యూల్ ఇదే:
ఆల్ ఇండియా కోటాలో నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్ జూలై 21వ తేదీ నుంచి నుంచి 30 వరకు జరగాల్సి ఉండగా, దానిని ఆగస్టు 9 వరకు పొడిగించారు. ఇక స్టేట్ కోటా విషయానికి వస్తే తొలి విడత కౌన్సెలింగ్‌ను ఆగస్టు 9వ తేదీ నుంచి 18 వరకు నిర్వహించాలని నిర్ణయించారు అధికారులు. ఈ మూడు విడతలు ముగిసిన తరువాత.. ఆల్ ఇండియా కోటా కింద స్ట్రే వేకెన్సీ కోటా కౌన్సెలింగ్ సెప్టెంబర్ 30వ తేదీ నుంచి 4 అక్టోబర్ వరకు జరగనుండగా.. రాష్ట్ర కోటాలో స్ట్రే వేకెన్సీ కోటా కౌన్సెలింగ్ అక్టోబర్ 2వ తేదీ నుంచి 5 వరకు జరుగుతుంది.