అప్లై చేసుకోండి: ఇండియన్ రైల్వేలో 2వేల 600 ఖాళీలు

  • Publish Date - October 27, 2019 / 09:50 AM IST

నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే (NFR) అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలు చేసింది. ఇందులో మెకానిస్ట్, వెల్డర్, ఫిట్టర్, కార్పెంటర్, మెకానికల్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్, లైన్‌మెన్, మేసన్, ఫిట్టర్ స్ట్రక్చరల్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటనెన్స్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 2590 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వయసు: 
అభ్యర్ధులు 15 నుంచి 24ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

ఎంపిక విధానం: 
అభ్యర్ధులను మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

విద్యార్హత: 
అభ్యర్థులు 10వ తరగతిలో 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేయాలి. 

Read Also: TS SPDCL లో 3 వేల ఉద్యోగాలు