ఏపీలో గ్రామ వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. పలు కారణాలతో 9 వేల 674 వాలంటీర్ల పోస్టుల భర్తీకి 2019, అక్టోబర్ 26వ తేదీ శనివారం నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. నవంబర్ 01వ తేదీ నుంచి భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది. నవంబర్ 10 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. 15 నుంచి దరఖాస్తులను అధికారులు పరిశీలించి..16 నుంచి 20 వరకు అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేస్తారు.
మొత్తం లక్షా 92 వేల 964 గ్రామ వాలంటీర్ల పోస్టులకు గాను లక్షా 83 వేల 290 మంది విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 9 వేల 674 పోస్టులు మిగిలిపోయాయి. జిల్లాల వారీగా ఆయా జిల్లాల్లో ఉన్న ఖాళీల సంఖ్యను బట్టి వేర్వేరుగా నోటిఫికేషన్‌లను జారీ చేస్తారని తెలుస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాల్సిన సంగతి తెలిసిందే. ఎంపికైన వారికి 2019, నవంబర్ 22వ తేదీన సమాచారం పంపుతారు. వీరికి శిక్షణ నవంబర్ 29, నవంబర్ 30 తేదీల్లో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు డిసెంబర్ 01 నుంచి విధులు నిర్వహిస్తారు.
Read More : అందమైన అమ్మాయిలతో ట్రాప్ : విశాఖలో ఫేక్ డేటింగ్