నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలో ఖాళీగా ఉన్న మొత్తం 3,038 పోస్టుల భర్తీ చేయనుందని తెలిపింది. త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ అధికారిక ప్రకటన చేశారు. నియామక బోర్డు నుండి అనుమతులు ఇప్పటికే లభించాయని, త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ వెలువడుతుందని వెల్లడించారు.
ఉద్యోగ నియామకాల ప్రక్రియలో గతంలో కొంత ఆలస్యం జరిగిందని కానీ, ఈసారి అలా కాకండా జాగ్రత్తలు తీసుకుంటామని వేగంగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఇదే తరహాలోనే మరిన్ని పోస్టుల భర్తీలు జరగనున్నాయని వెల్లడించారు. కాబట్టి, ఇది నిరుద్యోగులకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అభ్యర్థుల మెరిట్ ఆధారంగానే ఎంపిక జరుగనుంది.