తెలంగాణ వైద్యారోగ్యశాఖ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టి నుంచి(జులై 20) మొదలుకానుంది. జూలై 27తో గడువు ముగుస్తుంది. జూలై 28వ తేదీ నుంచి జూలై 29వ తేదీ వరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://mhsrb.telangana.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.దరఖాస్తు రుసుం కింద రూ. 500 చెల్లించాలి. ఇదే కాకుండా ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్య తేదీలు, వివరాలు:
ఉద్యోగం: అసిస్టెంట్ ప్రొఫెసర్
మొత్తం ఖాళీలు: 607
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 46 ఏళ్ల లోపు ఉండాలి.
విద్యార్హత: సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: రూ.500 చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు రూ.200 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు.
ముఖ్యమైన తేదీలు:
- జూలై 20 నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం
- జూలై 27న దరఖాస్తు గడువు ముగుస్తుంది.
- జూలై 28 నుంచి జూలై 29 వరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్
- వేతన వివరాలు: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.68,900 నుంచి రూ.2,05,500 వరకు జీతం అందుతుంది.