Indian Army Recruitment: బీటెక్‌ తో ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. ట్రేనింగ్ లోనే రూ.56 వేల జీతం.. వెంటనే అప్లై చేసుకోండి

Indian Army Recruitment: బీటెక్‌ కంప్లీట్ చేసినవారికి ఇండియన్ ఆర్మీ గుడ్ న్యూస్ చెప్పింది. షార్ట్ క‌మిష‌న్‌లోని 379 టెక్నిక‌ల్ పోస్టులను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

Notification released for 379 technical posts in Indian Army Short Commission

బీటెక్‌ కంప్లీట్ చేసినవారికి ఇండియన్ ఆర్మీ గుడ్ న్యూస్ చెప్పింది. షార్ట్ క‌మిష‌న్‌లోని 379 టెక్నిక‌ల్ పోస్టులను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ పోస్టుల కోసం ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తుల ప్రక్రియ మొదలవగా ఆగస్టు 22తో గడువు ముగియనుంది. కాబట్టి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు.

అర్హ‌త‌లు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీటెక్ పూర్తి చేసిన వారై ఉండాలి. లేదా బీటెక్ చివ‌రి ఏడాది చ‌దువుతున్న విద్యార్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

వ‌యోప‌రిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 20 ఏళ్ళ నుంచి 27 ఏళ్ల మ‌ధ్య‌లో ఉండాలి.

ముఖ్యమైన గమనిక:
పెళ్లికాని అభ్య‌ర్థులు మాత్ర‌మే ఈ పోస్టుల‌కు అర్హులు. వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

వేతన వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ట్రైనింగ్‌ సమయంలో రూ.56,100 స్టైఫెండ్ ఇస్తారు. లెఫ్టెనెంట్ హోదాతో పూర్తి విధుల్లోకి తీసుకున్న త‌రువాత‌ ఏడాదికి రూ.18 ల‌క్ష‌ల జీతం ఇస్తారు.