మీరు డాక్టర్ చదువు పూర్తి చేశారా? ఏదైనా మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీలాంటి వల్ల కోసమే కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలవారు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఆసుపత్రిలో తాత్కాలిక పద్ధతిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, సిఐఎస్ఐసియు స్పెషల్ లిస్టు పోస్టుల భర్తీ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ అధికారిక ప్రకటన చేశారు. ఆగస్టు 1 2025 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వూస్ జరుగనున్నాయి. కాబట్టి.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ https://www.gmcknr.com./gmcknr.html లేదా www.gmcknr.com ద్వారా అప్లిలేషన్ ఫారం పొందవచ్చు.
అప్లికేషన్ ఫీల్ చేసిన అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల నకలు పత్రాలతో ప్రభుత్వ వైద్య కళాశాల కొత్తపల్లి కరీంనగర్ నందు జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి సంబందించిన పూర్తి వివరాలు కాలేజీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఇంటర్వ్యూలో అభ్యర్థుల ప్రదర్శన, మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. కాబట్టి ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండ సద్వినియోగం చేసుకోవాలి అని అధికారులు తెలిపారు.