medical and health department recruitment
తెలంగాణలోని వైద్యశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు త్వరలోనే అప్లికేషన్ ఫార్మ్ లను కూడా విడుదల చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 10వ తేదీన ప్రారంభం కానున్న దరఖాస్తుల ప్రక్రియలో భాగం కావాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా అభ్యర్థులు తమ వివరాలను, అవసరమైన పత్రాలను నమోదు చేసి, తగిన ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ దరఖాస్తుల ప్రక్రియను జులై 17వ తేదీ వరకు కొనసాగనుందని, ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ లోనే ఉంటుందని మొడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలియజేసింది. ఈ ఉద్యోగానికి ఎంపికైతే అభ్యర్థులకు నెలకు రూ.68,900 నుంచి రూ.2,05,500 వరకు జీతం అందుతుంది. ఎంపికలో భాగంగా జరిగే ఇంటర్వ్యూ, రాత పరీక్షలో ఫలితం ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఇంకా ఏదైనా సందేహాల కోసం, పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి.