Notification released for the posts of Forest Section Officer in AP Forest Department
ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. అటవీశాఖలోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 100 పోస్టులను భర్తీ చేయనున్నారు అధికారులు. దీనికి సంబందించిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ జులై 28 నుంచి ఆగస్టు 17 వరకు కొనసాగనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
విద్యార్హత:
వృక్షశాస్త్రం/ఫారెస్ట్/హార్టీ కల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ/మ్యాథ్స్, స్టాటిస్టిక్స్/జియాలజీ/అగ్రికల్చర్ ఒక సబ్జెక్ట్ గా ఉండి డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి పట్టాదారుడై ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 01 జులై 2025 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము:
అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కోసం రూ.250, పరీక్ష ఫీజు కోసం రూ.80 చెల్లించాల్సి ఉంటంది.
వేతన వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.రూ. 32,670 నుంచి రూ.1,01,970 మధ్య జీతం అందుతుంది.
ఎంపిక విధానం:
అబ్యర్ధులకు స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ కూడా హాజరవ్వాల్సి ఉంటుంది.