ONGC Recruitment : ఆయిల్ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఈ నోటిఫికేషన్ ద్వారా ఉత్తరఖాండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న కంపెనీ పలు విభాగాల్లో ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. ఇంజనీరింగ్, జియో సైన్సెస్‌ విభాగాల్లో ఉన్న ఖాళీలను గేట్‌-2023 స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంజనీరింగ్, జియో సైన్సెస్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Oil and Natural Gas Corporation Limited job vacancies

ONGC Recruitment : ఆయిల్ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్ జీసీ)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉత్తరఖాండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న కంపెనీ పలు విభాగాల్లో ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. ఇంజనీరింగ్, జియో సైన్సెస్‌ విభాగాల్లో ఉన్న ఖాళీలను గేట్‌-2023 స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంజనీరింగ్, జియో సైన్సెస్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మెకానికల్, పెట్రోలియం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, కెమికల్ వంటి పలు విభాగాల్లో ఏఈఈ పోస్టులున్నాయి. అలాగే కెమిస్ట్, జియాలజిస్ట్, జియో ఫిజిసిస్ట్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్, ప్రోగ్రామింగ్ ఆఫీసర్, ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయసు 30 ఏళ్లకు మించరాదు. ఏఈఈ (డ్రిల్లింగ్/సిమెంటింగ్) పోస్టులకు 28 ఏళ్లు మించరాదు. అభ్యర్థులను గేట్‌ – 2023 స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://ongcindia.com/ పరిశీలించగలరు.