DIKSHA APP : ఒక్క క్లిక్ తో ఆన్ లైన్ పాఠాలు! దీక్షా యాప్ తో విద్యార్ధులకు సౌలభ్యం
విద్యాదాన్ ద్వారా ఎన్సీఈఆర్ టి, సీబీఎస్ఈ, ఎన్ఐఓఎస్, కెవీఎస్, ఎన్వీఎస్, రోటరీ ఇండియా లటరసీ మిషన్, ఎస్సీఈఆర్ టీలతోపాటు, ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్ధల సహాకారంతో మెరుగైన సమాచారాన్ని దీక్షా యాప్ లో అందిస్తున్నారు. ఉపాధ్యాయులే డిజిటల్ కంటెంట్ ను రూపొందించి ఈ యాప్ లో విద్యార్ధులకు అందుబాటులో ఉంచుతున్నారు.
DIKSHA APP DIGITAL
DIKSHA APP : సాంకేతిక వ్యవస్ధ విద్యావ్యవస్ధలో అనేక మార్పులను తీసుకువస్తోంది. మారుమూల ప్రాంతాల్లో ఉన్నా ఆన్ లైన్ లో పాఠాలు వినే సదుపాయాన్ని అధునిక సాంకేతిక ద్వారా సాధ్యమౌతోంది. మొబైల్ యాప్ ద్వారా విద్యార్ధులు తాము రోజువారిగా అభ్యసించే పాఠాలను ఒక్క క్లిక్ తో కళ్ల ముందు ప్రత్యక్షం అవుతుంది. ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా లేకపోయినా సందేహాలు నివృత్తి చేసుకునేందుకు, పాఠశాలలో పాఠాలు వినకపోయినా, అర్ధంకాకపోయినా విద్యార్ధులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ దీక్షా యాప్ పేరుతో ఒకే డిజటల్ ఫ్లాట్ ఫారంపై పాఠశాల విద్య కు సంబంధించిన పాఠాలను అందుబాటులో ఉంచారు. క్యూ ఆర్ కోడ్ సహాయంతో విద్యార్ధులు తమ సందేహాలను డిజిటల్ రూపంలో నివృత్తి చేసుకోవచ్చు.
దీక్షా యాప్ 32 భారతీయ భాషలలో కంటెంట్ ఈ యాప్ లో అందుబాటులో ఉంటుంది. ఎన్సీఆర్ టీ తోపాటు, స్టేట్ సిలబస్ కు అనుసంధానమై ఉన్న 6000 ఎనరైజ్డ్ టెక్ట్స్ బుక్స్, 2.71 లక్షల కరిక్యుల్ బేస్డ్ డిజిటల్ కంటెంట్, 7,200 కోర్సులను ఆఫర్ చేయటం ద్వారా 26 కోట్ల మంది విద్యార్ధులకు, 85లక్షల మంది ఉపాధ్యాయుల అభ్యసన అవసరాలను తీర్చనుంది. టీచింగ్, లెర్నింగ్ కు తోడ్పడే విధంగా పుస్తకాలు, ఆడియో, వీడియో , ఇంటరాక్టివ్స్, క్విజ్ లు , ఆటో సర్టిఫికేషన్, గేమిఫైడ్ లెర్నింగ్ , అసెస్ మెంట్, క్వశ్చన్ బ్యాంక్స్ వంటి కంటెంట్ దీక్షాలో అందుబాటులో ఉంటుంది.
ఇప్పటికే ప్రభుత్వం విద్యార్ధులకు సరఫరా చేసిన పుస్తకాల్లో పాఠాల మధ్యలో క్యూ ఆర్ కోడ్ ను ముద్రించారు. క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయటం ద్వారా పాఠాలు ప్రత్యక్షమౌతాయి. ఉపాధ్యాయులు సులభతరంగా , విద్యార్ధులకు అర్ధమయ్యే రీతిలో చెప్పిన పాఠాల వీడియోలు ఈ యాప్ లో ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది విద్యార్ధులు ఈ యాప్ ను వినియోగించుకుంటున్నారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలు ఇందులో ఉండటంతో విద్యార్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది.
విద్యాదాన్ ద్వారా ఎన్సీఈఆర్ టి, సీబీఎస్ఈ, ఎన్ఐఓఎస్, కెవీఎస్, ఎన్వీఎస్, రోటరీ ఇండియా లటరసీ మిషన్, ఎస్సీఈఆర్ టీలతోపాటు, ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్ధల సహాకారంతో మెరుగైన సమాచారాన్ని దీక్షా యాప్ లో అందిస్తున్నారు. ఉపాధ్యాయులే డిజిటల్ కంటెంట్ ను రూపొందించి ఈ యాప్ లో విద్యార్ధులకు అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణకు దీక్షా యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. అలాగే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం దీక్షా యాప్ లో 3,370 ఆడియో పాఠాలు, 596 ఇండియన్ సైన్స్ పాఠాలకు సంబంధించి వీడియోలు, 10,000 డిక్షనరీ పదాలను ఇందులో నిక్షిప్తం చేసి అందుబాటులో ఉంచారు.
మొబైల్ ఉంటే చాలా సులభంగానే ఈ దీక్షా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పుస్తకాల మధ్యలో ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవటం ద్వారా డిజటల్ కంటెంట్ ను అన్వేషించ వచ్చని
విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
